చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పారాగాన్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ డిజిటల్ మార్కెటీర్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో నలుగురు విద్యార్ధులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. బిటెక్, ఎంబిఎ, ఎంసిఎ ఆఖరి సంవత్సరం చదువుతున్న 65మంది విద్యార్ధులు ఎంపికలకు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు.
రాతపరీక్షలో 55మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఇంటర్వ్యూల్లో నలుగురు విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. తమ కళాశాల విద్యార్ధులు ముగ్గురు కాగా ఒకరు ఒంగోలు పేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు శిక్షణ అనంతరం సంవత్సరానికి రూ.2.50లక్షలు వేతనం ఇస్తారని ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఎంపికైన విద్యార్ధులను అభినందించారు.