చీరాల : గత కొన్నేళ్లుగా స్వయం ఉపాధి కోసం నిర్వహిస్తున్న ప్రవేట్ పాఠశాలల నిర్వాహకులను అధికారం ఉందని వేధిస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తారని వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ యడం బాలాజీ హెచ్చరించారు. చీరాల వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీరాల పర్యటనలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక హోదాపై ఒక్క మాటకుడా మాట్లాడకుండా వెళ్ళాటంటే టిడిపి చెందుతున్న మోసం అర్ధంచేసుకోవచ్చన్నారు. చీరాలలో జరుగుతున్న ఇసుక, లిక్కర్, భూ మాఫియా మంత్రికి కనిపించలేదాని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అర్హులైన అలబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండడంలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు అందుబాటులో ఉండి జగన్ ప్రకటించిన నవరత్న పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఎవరి భూమినో తీసుకుని ఇళ్లస్థలాలు ఇస్తున్నట్లు విలేకరులు కూడా మోసం చేస్తున్నారని చెప్పారు. తాము అధికారానికి వస్తే ఐదు సెంట్లు స్థలం ఇస్తామన్నారు.
ఈపురుపాలెం ఎంపిటిసి గోలి ఆనందరావు మాట్లాడుతూ సాంప్రదాయంగా ఎన్నో ఏళ్ళుగా నిర్వహిస్తున్న డైయ్యిగ్ లను రొయ్యల చెరువుల కోసం మూయించారని ఆరోపించారు. ఇన్నాళ్లు గా కనిపించని కాలుష్యం ఇప్పుడే ఎలా కనిపించిందని ప్రశ్నించారు. సమావేశంలో వైసిపి పట్టణ అధ్యక్షుడు బోనిగల జైసంబాబు, నీలం శ్యామ్, చీరాల నగర్ సర్పంచ్ రాజు శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసి గోలి ఆనందరావు పాల్గొన్నారు.