చీరాల : కాకినాడ జేఏన్టీయూ మార్చ్, ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన పాలిటెక్నిక్ పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల్లో చీరాల సెయింట్ ఆన్స్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. జిల్లాలోనే అత్యధిక ఫలితాలు సాధించినట్లు చెప్పారు.
వెయ్యికి 900పైగా మార్కులు 25మంది సాధిచినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. పాలిటెక్నిక్ ఈసిఈ తృతీయ సంవత్సరం చదువుతున్న షేక్ రిహాన 981మార్కులు, మెఖానికల్ విద్యార్థి పింజల వెంకటశివసాయి 963మార్కులు సాధిచినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులని ఇంచార్జ్ డైరెక్టర్ విజయభాస్కరరెడ్డి, మేనేజర్ ఆర్వీ రమణమూర్తి అభినందించారు.