Home జాతీయం తెలుగోళ్ల దెబ్బకు బిజెపి దిమ్మదిరనుందా?

తెలుగోళ్ల దెబ్బకు బిజెపి దిమ్మదిరనుందా?

375
0

అమరావతి :  బిజెపికి దక్షిణాది అంటే చిన్న చూపు… వాళ్ళ దృష్టింతా ఉత్తరాది మీదే…. ఈ దుర్నీతి చట్టం అమలు చెసే విషయంలో, రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిన విషయంలో తెలుగు రాష్ట్రాలు అంటే బీజేపీ ఢిల్లీ నేతలది… మోడీది ఎప్పటికి సవతి తల్లి దృష్టి. ఇందుకు చాలా ఉదంతాలే ఉన్నాయి. అయితే తాము ఆధారపడే విషయంలో… తెలుగు ప్రజలను అవసరానికి వాడుకునే విషయంలో మాత్రం బీజేపీ నేతలు కొద్దిగా కూడా సిగ్గు పడడం లేదు. ఏపీలో మిత్ర ధర్మంలో భాగంగా ఎమ్యెల్యే, ఎంఎల్సీ, రాజ్యసభ, టీటీడీ సభ్యత్వాలు, నామినేటెడ్ పదవులను అడిగి మరీ సిగ్గుపడకుండా తీసుకున్న బీజేపీ నేతలు తాము ఇవ్వాల్సి వచ్చేసరికి ఒక్కటంటే ఒక్క పదవి కూడా టీడీపీ నేతలకు ఇవ్వలేదు. తామే ఇస్తామన్న మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ గిరి విషయంలో నిలువునా మోసం చేశారు. ఇక రాజకీయాల విషయంలోకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాలను చిన్న చూపు చూసే మోడీ… షా ద్వయం ఏ మాత్రం సిగ్గు పడకుండా ఇక్కడి రాజకీయ పార్టీల ప్రోగ్రాంలను కాపీ కొడుతున్నారు.

తాజాగా గౌరప్రదమైన ఓటమి కోసం కర్ణాటకలో చెమటోడుస్తున్న మోడీ బృందం… ప్రజలను ఆకట్టుకునేందుకు వరాల మేనిఫెస్టో ప్రకటించింది. ఇతర రాష్ట్రాలు చేసినపుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించినపుడు విమర్సలు గుప్పించిన మోడీ ప్రభృతులు తమ దాకా వచ్చేసరికి తాము చెప్పిన నీతులు మర్చిపోయారు. చక్కగా తెనుగు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు కాపీ కొట్టేశారు. సొంతగా కొన్ని పధకాలను రూపొందించుకోలేని భావ దారిద్య్రంలో ఉన్నారో లేక గెలవని ఎన్నికల కోసం ఎందుకు కష్టపడాలి అనుకున్నారో కానీ ఎంచక్కా తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలను కాపీ కొట్టేశారు. అన్ని పధకాలను దించి పెట్టేసారు.

ఒకప్పుడు ఇదే రుణ మాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే దాన్ని చేయనీయకుండా అడ్డం పడి ఘనత వహించిన మోడీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో రైతు మనసు దొచేందుకు అదే రుణ మాఫీని కాపీ కొట్టి మరీ ప్రకటించారు. మోడీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందితో చంద్రబాబు రుణమాఫీ చేయడానికి ఎంతో శ్రమకోర్చాల్సి వచ్చింది. ఇక కర్ణాటకలో బీజేపీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక తమ మేనిఫెస్టోని కాపీ కొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో ఓట్ల కోసం.. తెలంగాణలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పేర్లు మార్చి బీజేపీ తన మేనిఫెస్టోలో కాపీ కొట్టడం సంతోషకరమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పొగడ్తకు అనుకరణ ఉత్తమ మార్గమని శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కర్ణాటక బీజేపీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఉదాహరించారు.

మిషన్‌ కాకతీయ పథకానికి మిషన్‌ కల్యాణి అని, కల్యాణలక్ష్మి పథకానికి వివాహ మంగళ యోజన అని పేర్లు పెట్టి పేర్కొన్న బీజేపీ.. రైతులకు రూ.లక్ష రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అలాగే… పేదలకు ‘వివాహ మంగళ’.. వధువుకు రూ.25 వేలు, తాళి, మెట్ట రైతులకు ఒక్కసారి రూ.10 వేల ఆర్థిక సాయం, రైతులకు, నేతన్నలకు రూ.లక్ష దాకా రుణ మాఫీ, మద్దతు ధరల కోసం ‘రైతు బంధు’ కింద రూ.5 వేల కోట్లు, చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్‌ కల్యాణి పథకం, టీ- హబ్‌ తరహాలో 6 పట్టణాల్లో కే-హబ్‌ల ఏర్పాటు, రాష్ట్రంలో 300 ముఖ్యమంత్రి అన్నపూర్ణ క్యాంటీన్లు వంటివన్నీ తెలుగు రాష్ట్రాల నుంచి యధాతధంగా దించేశారు. ఔరా… దటీజ్ మోడీ…!