అమరావతి : దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నింధితుడు సుబ్బయ్య గురజాల వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుని ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో ఎక్కడ దొరికినా తనను బ్రతకనివ్వరన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్తాపంతో తాను ఇక బ్రతకూడదని ఆత్మమత్యకు పాల్పడ్డాడు. చివరి సారి తన తమ్ముని కొడుకుతో ఫోనులో మాట్లాడారు. ఫోను సంబాషణ ఇలా….
“నువ్వు ఎక్కడున్నావు.
చావుకు దగ్గరున్నా. పదిమందికి మంచి చెప్పి సరదాగా బ్రతికేవాణ్ణి. నా ఖర్మ కాలిగింది. ఆకాంరంతో జరిగింది. నీకు కనపడకూడదు. కా ఖర్మ పండింది. పాపం పండింది.
ఎక్కడున్నావో చెప్పు.
ఏమొద్దయ్యా… నా కొడుకు ఎలా బ్రతుకుతాడో. పరువు పోయింది.
యాడున్నవ్ నువ్వు.
పొద్దున్నే చూస్తే శవమై అందుబాటులో కనబడతాలే… చావుకు దగ్గరలో ఉన్నాలే… లేదులే నా జీవితం… పదిమందికి మంచి చెప్పి సరదగా బ్రతికేవాణ్ణి నాఖర్మ పండింది. నేను చేసిన పనికి నా కొడుకు ఎలా బ్రతుకుతాడో. వాళ్లకు పరువు లేకుండా చేశాను. జరగకూడనిది. అహంకారంతో జరిగింది. “