హైదరాబాద్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. సిపిఎం 22వ అఖిలభారత మహాసభల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. నాలుగు రోజులపాటు హైదరాబాద్లో జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో వివిధ రాజకీయ, నిర్మాణ అంశాలపై తీర్మానాలు చేశారు.
ఆదివారం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. అదే విధంగా 17 మంది పొలిట్ బ్యూరో సభ్యులను ఎన్నుకున్నారు. 95మంది కేంద్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ప్రసంగించిన సీతారం ఏచూరి దేశంలో వామపక్ష ప్రజా సంఘాలను ఐక్యం చేసుకుని పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా అన్ని శక్తులను ఏకం చేసి ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలపై ఉద్యమిస్తామని చెప్పారు.