Home ప్రకాశం చంద్రన్న పోరాటం భావి తరాలకోసం : దాసరి రాజా మాష్టారు

చంద్రన్న పోరాటం భావి తరాలకోసం : దాసరి రాజా మాష్టారు

458
0

కందుకూరు : రాష్ట్రానికి ప్రత్యెక హోదా సాదించడం కోసం పార్టీ పార్లమెంట్ సభ్యుల ద్వార చంద్రన్న చేస్తున్న పోరాటం బావి తరాల కోసమేనని, రాష్ట్రం క్లిష్ట సమయంలో ఉన్న ప్రతిసారి దాని పరిష్కారం కోసం పోరాటం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ శిభిరం డైరెక్టర్ దాసరి రాజా మాష్టారు అన్నారు. స్థానిక తెలుగు విజయం ప్రాంగణం లో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో 166వ బాచ్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. రాజా మాస్టర్ మాట్లాడుతూ  రాష్ట్రానికి ప్రత్యెక హోదా కోసం ఎవ్వరు పోరాడిన దాని అంతిమ లక్ష్యం హోదా సాధనే అని అన్నారు. ప్రధాని మోడీని నేరుగానే టార్గెట్ చేస్తూ పోరాడుతున్నామని చెప్పారు. దానికోసం పార్టీ పార్లమెంట్ సభ్యలు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఎంపీలకు ఈ శిక్షణా శిభిరం ద్వార సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ప్రధాని మోడీ సమాఖ్య ప్రభుత్వ స్పూర్తికి విరుడ్డ్డంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడుతున్నారని అన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావలసిన అన్ని అంశాల మీద ఢిల్లీలో అన్ని పార్టీలకు, పాత్రికేయులకు సవివరంగా వివరించారని చెప్పారు. చంద్రన్న పోరాటం బావి తరాల బాగు కోసమేనని రాజా మాష్టారు అన్నారు.  మోడీ హయంలో ఇంతవరకు ఎ పార్టీ నాయకులు చేయని రీతిలో పార్టీ పార్లమెంట్ సభ్యులు మెరుపు ధర్నా చేసారని అన్నారు. కనీసం పార్లమెంట్ సభ్యలు అని చూడకుండా వారి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన విధానం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అడ్డం పడుతుందని అన్నారు. రాబోయే ఎన్నికలలో బిజెపి ఓడిపోవడం ఖాయం అని రాజా మాష్టారు జ్యోస్యం చెప్పారు. ఈ శిక్షణకు  ప్రకాశం జిల్లా నుండి ఒంగోలు, చీరాల, సంతనూతలపాడు నియోజక వర్గ మండల, గ్రామ స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కాకర్ల మల్లికార్జున్, పసుపులేటి పాపారావు, చైతన్య, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.