Home బాపట్ల చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న టిడిపి, వైసిపి కౌన్సిలర్లు : విస్తుపోతున్న తెలుగుదేశం కార్యకర్తలు

చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న టిడిపి, వైసిపి కౌన్సిలర్లు : విస్తుపోతున్న తెలుగుదేశం కార్యకర్తలు

127
0

చీరాల : వైసిపి నుంచి వచ్చి పార్టీలో చేరే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి శ్రేణులకు తరచుగా హితబోధ చేస్తున్నారు. అయితే చీరాలలో మాత్రం ఈ మాటలు పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు.

చీరాల మున్సిపాలిటీలో ఫ్యాన్ సింబల్ పై గెలిచిన కౌన్సిలర్లు కొందరు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం వారి వార్డులో ఇన్చార్జిలుగా పెత్తనం చేస్తూ మున్సిపాలిటీలో అధికారాన్ని కూడా అనుభవిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే పార్టీ మారిన ఈ కౌన్సిలర్లలో కొంతమంది ఇప్పటికీ తమ పాత వైసిపి నాయకత్వంతో టచ్ లోనే ఉంటున్నారు.

తాజాగా కొందరు తెలుగుదేశం కౌన్సిలర్లు, వైసిపి కౌన్సిలర్లు కలిసి చేసుకున్న ఒక విందు పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన తెలుగుదేశం కార్యకర్తలు విస్తు పోతున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ పార్టీలో చేరి అధికారం అనుభవిస్తూ ఈ విధంగా వైసీపీతో అంతకాగటమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తెలుగుదేశం అధిష్టానానికి పిర్యాదు చేసేందుకు కొందరు కార్యకర్తలు సిద్ధ మయ్యారని తెలుస్తుంది.