Home బాపట్ల కృతి ఫౌండేషన్‌ సేవారత్న అవార్డుల బహుకరణ

కృతి ఫౌండేషన్‌ సేవారత్న అవార్డుల బహుకరణ

176
0

చీరాల : కృతి ఫౌండేషన్ అధినేత అశ్విని ఆధ్వర్యంలో కృతి పౌండేషన్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక రోటరీ క్లబ్ ఆవరణలో వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారికి డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌కలాం జాతీయ సేవా అవార్డులను ఆదివారం అందజేశారు. టీడీపీ యువ నాయకులు మద్దలూరి అమర్నాథ్, జమ్మలమడక నాగ మణి, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ బాబీ రాణి, చిన్నగంజాం తహశీల్దారు జీవిగుంట ప్రభాకరరావు, పట్టణ సిఐ సిఐ సూరేపల్లి సుబ్బారావు, మెరైన్ సిఐ సింగిరీసు సాంబశివరావు, వైసిపి నాయకులు డాక్టర్ వి అమృతపాణి, గౌరవ అధ్యక్షులు ఆకురాతి వెంకట వరప్రసాదరావు పాల్గొన్నారు. వైద్య, సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ తాడివలస దేవరాజుకు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జాతీయ సేవారత్నా అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు మద్దులూరి అమర్నాథ్ మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ ఐదేళ్లుగా చేస్తున్న సేవలను కొనియాడారు. చీరాలలో జరుగు సేవా కార్యక్రమాలకు కృతి ఫౌండేషన్‌కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ సభ్యులు, ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వివిధ సేవా రంగాల్లో ఉన్న ప్రముఖులకు అవార్డు అందచేశారు.