Home బాపట్ల ఏకెపి కళాశాలకు వాటర్ ఫిల్టర్ బహుకరణ 

ఏకెపి కళాశాలకు వాటర్ ఫిల్టర్ బహుకరణ 

98
0

చీరాల : ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గుద్దంటి రమేష్ బాబు సహకారంతో విద్యార్థుల సౌకయార్థం రూ.15వేల విలువైన ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు, ప్రగడ కోటయ్య జూనియర్ కళాశాలకు బుధవారం బహుకరించారు. భవిష్యత్తులో కళాశాలకు అవసరమైన సహాయం జేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, గుర్రం బదరీనాథ్, గుద్దంటి రమేష్ బాబు, పులిమి శ్రీకృష్ణ ప్రసాద్, గోలి మల్లిఖార్జునుడు, ప్రగడ వెంకట శేష సయ్యన్, ప్రిన్సిపాల్ సిహెచ్ బాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.