వేటపాలెం : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజిలో (StANNs Eng’College) కాకినాడ జెఎన్‌టియు (Kakinada JNTU) పవర్ లిఫ్టింగ్, బాడి బిల్డింగ్ పురుష, స్త్రీల విభాగంలో పోటీలు నిర్వహించారు. (Power Lifting, Body Building) ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్, యునివర్సిటి టీం సెలక్షన్స్ ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె జగదీశ్ బాబు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి కృషి చేసినట్లైతే మానసిక ఆరోగ్యం ధృడంగా ఉంటుందని తెలిపారు.
వేటపాలెం ఎస్‌ఐ ఎం వెంరటేశ్వర్లు మాట్లాడుతూ ఆటల పోటీల్లో గెలుపు కన్నా పాల్గొనటం ముఖ్యమని అన్నారు. పాల్గొటే ఈ సారి కాకపోతే మరోసారి గెలవవచ్చని అన్నారు. పాల్గొనడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చని తెలిపారు. పవర్ లిఫ్టింగ్ వలన శారీరక ధృడత్వం పెరుగుతుందని అన్నారు.
ఈ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్‌కు కాకినాడ జెఎన్‌టియు పరిధిలోని కళాశాలల విద్యార్ధులు హాజరయ్యారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్ధులకు వసతి, బోజనం ఏర్పాట్లు చేసినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు, కాకినాడ జెఎన్‌టియు స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ జెఎన్‌టియు స్పోర్ట్స్ కౌన్సిల్ నుండి డాక్టర్ ఎన్ శేషగిరిరావు పరిశీలకులుగా విచ్చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ డాక్టర్ సి సుబ్బారావు (అక్రిడిటేషన్), ఆర్‌వి రమణమూర్తి (అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్), వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.