Home బాపట్ల ప్రజా ‘సంకల్పం’తోనే ఉచిత కంటి వైద్య శిబిరాలు : ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు

ప్రజా ‘సంకల్పం’తోనే ఉచిత కంటి వైద్య శిబిరాలు : ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు

41
0

పర్చూరు : ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఉచిత కంటి వైద్య శిబిరాలు రాజకీయాలకు అతీతంగా కొనసాగిస్తున్నట్లు ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక వైఆర్ హైస్కూల్లో నోవా అగ్రి గ్రూప్స్, ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఒక యజ్ఞంలా పవిత్ర ఆశయంతో రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లు దుర్మార్గపు పాలన కొనసాగిందని ఆరోపించారు.

కనీసం పేద ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు సైతం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాలను సైతం రాజకీయం చేశారని మండిపడ్డారు. క్యాంపుల ద్వారా తనకేదో మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో కుట్రలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా 200కుపైగా ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించి అనేక మందికి కంటి చూపు కల్పించామని అన్నారు. గత ప్రభుత్వంలో పాలన గాడి తప్పడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రణాళికాబద్ధంగా ఎరువులు, సాగునీరు అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నామని అన్నారు.

ప్రజా జీవితంలో అనేక మంది రాజకీయ నాయకులకు సమాజ సేవ చేయాలనే లక్ష్యం ఉంటుంది కానీ అది చరణలో చేసి చూపడం అందరికీ సాధ్యం కాదని టిడిపి బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు సలగల రాజశేఖరబాబు అన్నారు. కానీ ఎంఎల్‌ఎ ఏలూరి ప్రజాసేవలో నిరంతరం తరిస్తూ తనకు ఎవరు సాటి లేరని నిరూపించారని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సేవలందించడంలో ఎంఎల్‌ఎ ఏలూరికి సాటి లేరని జనసేన ఇంచార్జ్ పెద్దపూడి విజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కంటిచూపు అందించడమే లక్ష్యంగా వైద్య శిబిరాలు నిర్వహిన్న ఎంఎల్‌ఎ ఏలూరిని టిడిపి మహిళా నాయకురాలు ఉషారాణి అభినందించారు. ఉచిత కంటి మెగా వైద్య శిబిరానికి హాజరైన ప్రజలందరికీ అన్నదానం చేశారు.