Home ఆధ్యాత్మికం రామానందాశ్రమంలో ఉచిత వైద్య శిభిరంకు విశేష స్పందన

రామానందాశ్రమంలో ఉచిత వైద్య శిభిరంకు విశేష స్పందన

509
0

చీరాల : వాడరేవు రామానందాశ్రమంలో ఆదివారం ఉచిత షుగర్ వైద్య శిభిరం నిర్వహించారు. శిబిరంలో గుంటూరు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజరాజేశ్వరి, విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కమలారాజేశ్వరి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శిభిరానికి హాజరైన 1200మందికిపైగా రోగులకు ఆహారం, తాగునీరు ఏర్పాటు చేశారు.

వైద్య పరీక్షల అనంతరం నెలరోజులకు సరిపడు మందులను ఉచితంగా అందజేశారు. బిపి, షుగర్ పరీక్షలు ఉచితంగా చేశారు. డాక్ట‌ర్ ప్ర‌కాష్‌, డాక్ట‌ర్ ర‌వికాంత్‌, డాక్ట‌ర్ శ్రీ‌కాంత్‌, డాక్ట‌ర్ సుధాక‌ర్, చీరాల వైఎ మ‌హిళా క‌ళాశాల విద్యార్ధులు, వాడ‌రేవు ఉన్న‌త పాఠ‌శాల విద్యార్ధులు సేవ‌లందించారు. కార్యక్రమంలో ఆశ్రమ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, మేనేజర్ ఎన్ సురేష్, గోపాల్‌, బ‌స‌వ‌రావు, ఎ సురేష్‌, ఎంజి శంకరరావు, దేవాదాయశాఖ అధికారి జివిఎల్ కుమార్ పాల్గొన్నారు.