Home బాపట్ల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా వందరోజుల పాలన : కొండయ్య

అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా వందరోజుల పాలన : కొండయ్య

29
0

చీరాల : రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఎ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎంఎల్‌ఎ మద్దులూరు మాలకొండయ్య అన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని మండలంలోని ఈపురుపాలెంలో ఆదివారం నిర్వహించారు. 100 రోజుల పాలనలో సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ‘ఇది మంచి ప్రభుత్వం’ అని అనిపించుకుంటున్నట్లు చెప్పారు. వృద్దాప్య పెన్షన్ రూ4వేలు, వికలాంగుల పెన్షన్ రూ.6వేలు, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటీన్లు’, యువత భవిష్యత్తుకు ‘మెగాడీఎస్సీ’, ప్రజల ఆస్తుల భద్రతకు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.