Home ఆంధ్రప్రదేశ్ అపార నష్టం – ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

అపార నష్టం – ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

149
0

బాపట్ల : తుఫాను దాటికి అపార నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె ప్రాంతాల్లో వరదలు కారణంగా నష్టపోయిన వరి పొలాలను ఆయన బుధవారం పరిశీలించారు. నుర్పిడి చేసిన దాన్యం కల్లాలలోనే తడిసి ముద్దయ్యాయని అన్నారు. మిషన్లతో కోసిన ధన్యం రోడ్లపైనే ఉందని అన్నారు. లక్ష ఎకరాల వరిపంట కోత దశ ఉండగా తుపాను గాలికి నేలవాలి నీట మునిగిందని తెలిపారు. తడిసిన దాన్యం రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదనతో ఉన్నట్లు చెప్పారు. నీట మునిగిన వరి డబ్బులు, కంకులు వెంటనే నీళ్లు తీయకపోతే మొలకలు వస్తాయని అన్నారు. అధికారులు వెంటనే నీటిని తీసేందుకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ అధికారులు తక్షణమే నష్టం అంచనా వేయాలని కోరారు. ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం చెల్లించడంతోపాటు మద్దత్తు ధర ఇచ్చి తడిసిన దాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో వర్షాలకు తడిచి ధాన్యం పరిశీలించారు. ఆయన వెంటనే సిపిఎం రాష్ట్ర నాయకులు డి రమాదేవి, సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, కె ధనలక్ష్మి, తదితరులు ఉన్నారు.