Home జాతీయం INDIA Shock: ఇండియా కూటమికి సీపీఎం బిగ్ షాక్?

INDIA Shock: ఇండియా కూటమికి సీపీఎం బిగ్ షాక్?

301
0

న్యూఢిల్లీ : దేశంలో ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమికి అనూహ్య ఎదురుదెబ్బ తగలబోతోందా? అంటే ఔననే అనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో ఇండియా కూటమికి దూరంగా జరగాలని సీపీఐ(ఎం) CPI-(M) నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి. బెంగాల్‌లో టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ పార్టీలు సిపిఎంకు ప్రధాన ప్రత్యర్థులు. ప్రతిపక్షాల ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియా కూటమి వర్గాలు చెబుతున్న నేపధ్యంలో కేరళ, బెంగాల్‌ రాష్ట్రాల్లో సిపిఎంకు నష్టం జరుగుతుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో వారాంతం జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం జరిగినట్లు మీడియాలో రావడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.

మరోవైపు బీజేపీ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా నిర్వహించే సమన్వయ సమావేశాలకు ప్రతినిధులు ఎవర్నినీ పంపించకూడదని సీపీఎం నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని సిపిఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సీపీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది బీజేపీ సారధ్యంలోని కూటమికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న ఇండియా కూటమిలోని లోపాలకు ఇదొక సంకేతమనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సి ఉంది.