Home క్రైమ్ బైక్‌పై రొమాన్స్‌… ఇంత బరితెగింపా…

బైక్‌పై రొమాన్స్‌… ఇంత బరితెగింపా…

281
0

ఇటీవల కాలంలో కొందరు ప్రేమికులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేస్తున్నారు. రొమాన్స్‌లో మునిగి తేలుతున్నారు. ఇలాంటివి చూసిన కొందరు వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. చివరికి పోలీసుల వరకు వెళ్తున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. అచ్చం ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్‌గా మారింది. ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై బైక్‌పై వెళ్తూ హద్దులు దాటి రొమాన్స్ చేశారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ అయ్యి పోలీసులకు చేరింది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగంజ్ ప్రాంతంలో ఓ ప్రేమ జంట అర్థరాత్రి బైక్ పై వెళ్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వెళ్తే పర్వాలేదు. కానీ, ఏకంగా బైక్ పైనే రొమాన్స్ చేశారు. ప్రియుడు బైక్ నడుపుతుండగా ప్రియురాలు అతని ముందు తిరిగి కూర్చుంది. దీంతో ఇద్దరు కౌగిలించుకుంటూ ముద్దులతో రెచ్చిపోయారు. ఇదంతా చూసిన కొందరు వాహనదారులు తలలు తిప్పుకున్నారు. మరి కొందరు మాత్రం సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక ఇదే వీడియో సోషల్ మీడియలో పోస్ట్‌ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. చివరికి పోలీసుల వరకు వెళ్లింది.

దీనిపై స్పందించిన పోలీసులు.. ఈ ఘటన ఇప్పడిది కాదని, వీరిని గతంలోనే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నడి రోడ్డుపై రొమాన్స్ లో హద్దులు దాటిన ఈ రొమాంటిక్ లవర్స్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.