Home ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ పూర్తి ప్లాస్టిక్ కాదు

ఫ్లెక్స్ పూర్తి ప్లాస్టిక్ కాదు

342
0

– ఫ్లెక్స్ ప్రింటింగ్ రంగంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునర్ ఆలోచన చేయాలి. – ప్రకాశం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా ఫ్లెక్స్ యూనియన్ సభ్యులు

ఒంగోలు : ఫ్లెక్స్ అనేది పూర్తి ప్లాస్టిక్ తో తయారు చేయబడింది కాదని దాంట్లో కొంత మోతాదులో మాత్రమే ప్లాస్టిక్ ఉంటుందని ప్రకాశం జిల్లా ఫ్లెక్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల ఫ్లెక్స్ ప్రింటింగ్ రంగంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని శాంతియుత నిరసనను సోమవారం తెలియజేశారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం శాంతియుత నిరసనలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడారు.

ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలనేటువంటి ఆలోచనతో తాము ఏకీభవిస్తున్నామని, ఫ్లెక్స్ అనేది నిషేధించదగిన పూర్తి ప్లాస్టిక్ కాదని రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 100 మైక్రాన్స్ లోపు ఉన్న ప్లాస్టిక్ ని బ్యాన్ చేయవలసి ఉందని అయితే మేము ఉపయోగించేటువంటి ఫ్లెక్స్ 180 నుండి 200 మైక్రాన్స్ కలిగి ఉంటుందని ఇది రీసైకిల్ చేయడానికి రీ యూస్ చేయటానికి ఉపయోగపడుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్ ఇంజనీరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వారి ద్వారా విడుదల చేయబడిన నివేదికలు ఉన్నాయన్నారు.

కోవిడ్ కారణంగా ఇప్పటికే ఈ పరిశ్రమ చాలా దెబ్బతిని ఉందని ఇప్పుడే కోలుకుంటున్న ఈ పరిశ్రమపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితంగా ఉందని భావిస్తున్నామన్నారు. ఫ్లెక్స్ రంగాన్ని నమ్ముకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం మరో మారు ఈ అంశంపై పునరాలోచన జరిపి ఫ్లెక్స్ రంగాన్ని కాపాడి దీనిని నమ్ముకున్న వారిని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ జి కేశవ, వైస్ ప్రెసిడెంట్ కే వంశీ, సెక్రటరీ జి మధుసూదన్ రావు, జాయింట్ సెక్రెటరీ కే సురేష్, ట్రెజరర్ షేక్ రహ్మాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎం లక్ష్మయ్య, సయ్యద్ జమీర్, ఒంగోలు, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ల యజమానులు , కార్మికులు తదితరులు పాల్గొన్నారు.