అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం వహించే అవకాశాలున్నాయంటూ రిపబ్లిక్ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇప్పటికే 7 పార్టీలు టీడీపీకి మద్దతు ప్రకటించాయని, మేలో చంద్రబాబు అధికారికంగా ప్రకటి స్తారని పేర్కొంది.
అఖిలేశ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ)తో మాట్లాడాక.. ఎన్డీయే నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. అయితే, జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించడంపై తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ సంకేతాలు పంపారని, టీఎంసీ అధినేత్రి మమత కూడా ఈ దిశన ప్రయత్నాలు ప్రారంభించారని గుర్తుచేసింది.
మరోవైపు.. ఫెడరల్ ప్రంట్‌పై పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎంపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కూటమి అంటూ ఏర్పడితే చంద్రబాబు తప్ప సారథ్యం వహించగల నాయకుడు మరొకరు లేరని, గతంలోనూ ఇలాంటి కూటమిని విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ అయితే టీడీపీ ఎంపీలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కనపడ్డారు.