కొత్త సాగు చట్టాలు రైతులకు ఉరితాళ్ళు : సీపీఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు

    190
    0

    టంగుటూరు : పొందూరు సీపీఎం ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాలపై సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో సీపీఎం తూర్పు ప్రకాశం కార్యదర్శి పునాటి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలు వలన భారత దేశంలో రైతాంగ కుటుంబాలు బలి కాబోతున్నాయని అన్నారు. కార్పోరేట్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు ఎక్కడైతే తక్కువగా దొరుకుతాయో అక్కడ కొనుగోలు చేసి అవి భారత దేశంలో అమ్ముకోవటానికి అవకాశం కల్పించి, భారతదేశంలో రైతులు పండించే ఆహార ధాన్యాలు అమ్ముకునే పనిలేకుండా చేయబోతున్నాయని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు దరలేక రైతులు నష్టాల పాలవుతారని తెలిపారు.

    మోడీ తెలివిగా కార్పొరేట్ కంపిణీలతో లాబీయింగ్ చేసి ఆయా కంపిణీలకు రెడ్ కార్పెట్ పరిచి దేశంలోకి ఆహ్వానించి ప్రజలకు తక్కువ ధరకు అన్ని ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పి చివరికి భారతదేశాన్ని వారికి దారా దత్తం చేస్తున్నారని ఆరోపించారు.

    వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళు చెప్పిన ధరలకు నిత్యావసర వస్తువులు కొనే విధంగా చేయబోతున్నారని అన్నారు. మోడీకి కావాల్సింది కార్పొరేట్ కంపినీలు ఇచ్చే లాబీయింగ్ డబ్బులు కావాలని తద్వారా ఎన్నికలలో డబ్బు కర్చుచేసి అధికారంలో శాస్వితంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొత్త సాగుచట్టాల వలన మొదటగా రైతులు నష్టపోతే అంతిమంగా భారతదేశ ప్రజలు నిత్యావసర వస్తువులు అధికదరలకు కొనలేక అల్లాడి పోయే పరిస్థితి రాబోతుందని తెలిపారు. కాబట్టి మోడీ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. భారత దేశంలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగ కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ నెల 21న ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా ఒంగోలులో జరిగే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ప్రదర్శనలో రైతులు వాహనాలతో పాల్గొనాలని కోరారు.

    సీపీఎం పొందూరు గ్రామ కార్యదర్శి వేజండ్ల సింగయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య, సిపిఎం టంగుటూరు మండల నాయకులు వేసుపోగు మోజస్, రైతులు వేజండ్ల బలరాం, పామురి శ్రీనివాసరావు, వి సుబ్బరావు, బి నరసింగరావు, బి కృష్ణ, సిహెచ్ నారాయణ, వి హనుమంతరావు, బి పున్నారవు, వెం కటేశ్వర్లు, జి కృష్ణ పాల్గొన్నారు.