Home క్రైమ్ ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నేర సమీక్ష

ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నేర సమీక్ష

429
0

ఒంగోలు : జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో ఎస్పీ శిద్దార్ద్ కౌశిల్ నేర సమీక్షా సమావేశమును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించినారు. నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ప్రత్యేకంగా బాలికలు, మహిళలపై జరిగే నేరాల గురించి ప్రస్తావించారు. జిల్లాలో ఉన్న పెండింగ్ కేసుల గురించి మాట్లాడుతూ త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. ఇటువంటి నేరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రోజు నిశితంగా పరిశీలిస్తున్నదన్నారు. అందువలన అధికారులందరూ పెండింగ్ లో ఉన్న  కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫర్స్ కూడా ప్రతిరోజు ఈ కేసుల గురించి పరిశీలిస్తుందన్నారు. అధికారులు కేసు నమోదైన వెంటనే దర్యాప్తు ప్రారంభించి 60రోజుల్లో అనగా రెండు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయాలని చెప్పారు.