జూబలీహిల్స్ : డివిజన్ ఫిలింనగర్ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టడుతూ స్థానిక సమస్యలు తెలుకోవడానికి బిజెపి పాద యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజల అనేక సమస్యలు తెలుపారు. ప్రతి బస్తీలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉంది. సీజనల్ వ్యాధుల నివారణకు ఎలాంటి చర్యలు చేట్టకపోవడం. రోడ్లు మొత్తం గుంతల మయం అయినవి. ఎక్కడి చెత్త అక్కడే ఉంది. ఇంకా ఎన్నో సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ డివిజన్ డివిజన్ బిజేపి నాయకులు వెల్దండ వెంకటేష్, నగర కార్యదర్శి చండ్ర మధు, డివిజన్ అధ్యక్షుడు శంకర్, గడ్డం వెంకటస్వామి, మహిళలు, యువకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.