హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. అందులోనూ స్వేచ్ఛ ఎక్కువే. ప్రభుత్వాన్ని నడిపేందుకూ నిబంధనలున్నాయి. కానీ నిబంధనలు రూపొందిచే వేదిక శాసన సభ. అలాంటి పవిత్రమైన శాసన సభలో తెలంగాణ ఎంఎల్ఎలు ఎంత గొప్పగా ఎంత మర్యాద పూర్వకంగా మాట్లాడుకుంటున్నారో? ఎంత గొప్పగా ప్రజాసమస్యలపై చర్చిస్తున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
అజెండా కాపీలను కాంగ్రెస్ ఎంఎల్ఎలు, టిఆర్ఎస్ ఎంఎల్ఎలు శాసన సభమావేశంలోనే ఎలా చింపేశారో చూడండి. అజెండాపైనా, శాసన సభపైనా కనీస మర్యాద కూడాలేని వీళ్లు ఏం పరిపాలిస్తున్నారో చూడండి. మరొక ఎంఎల్ఎ ఏకంగా గవర్నర్ ప్రసంగిస్తున్న పోడియం వద్దకు వెళ్లి మైకులు పీకేయబోయాడు. ఇదీ మన చట్టసభల సాంప్రదాయం కాదు. కానీ ఎలా మారిపోయిందో చూడండి.