Home ప్రకాశం స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2కె ర‌న్‌

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2కె ర‌న్‌

372
0

చీరాల : స్వచ్ఛ సర్వేక్షణ్ – 2019లో భాగంగా పుర‌పాల‌క సంఘం ఆధ్వ‌ర్యంలో 2కె ర‌న్ నిర్వ‌హించారు. 2కె ర‌న్ కార్య‌క్ర‌మాన్ని ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్న‌త పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రిబ్బ‌న్ క‌ట్ చేసి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ స్వేచ్చ స‌ర్వేక్ష‌ణ్‌లో చీరాల పుర‌పాల‌క సంఘం రెండవ స్థానంలో ఉంద‌న్నారు.

భ‌విష్య‌త్తులో చీరాలను మొదట స్థానానికి తీసుకెళ్లడానికి అందరూ స‌మిష్టిగా కృషి చేయాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్న మున్సిపల్ అధికారులును అభినందించారు. చీరాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. 2కె రన్ పట్టనంలోని ప్రధాన రహదారులు గుండా నడిచింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొదడుగు రమేష్ బాబు, కౌన్సెల్లర్ సత్య నారాయణ, సానిటరీ విభాగ అధికారి బషీర్, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.