Home ప్రకాశం రాజకీయ సమీక్షలు తరిస్తున్న అధికారులు 

రాజకీయ సమీక్షలు తరిస్తున్న అధికారులు 

24
0

ఒంగోలు : రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీ కార్యకర్తల కనిష్ట సమావేశాలకు హాజరు కావడం కొత్త తరహా సాంప్రదాయానికి తెరదేసింది. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా పనిచేసిన అధికారులు కోర్టు బోనులో ముద్దాయిలుగా నిలబడిన ఘటనలు చూసాం. అందుకు భిన్నంగా నిష్పక్షపాత పరిపాలన అందిస్తామన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధికారులను, ప్రజా ప్రతినిధులను గత ప్రభుత్వ వారసత్వ విధానము నుండి బయటకు తీయలేకపోవడం విమర్శలకు కారణమైంది. తెలుగుదేశం ఒంగోలు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ వేంకటేశ్వరరావు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా రాజకీయ సమావేశాల్లో పాల్గొనడం ఇతర అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ కార్యాలయంలో ,పార్టీ జెండా కింద ఈనెల 4న జరిగిన కూటమి సమీక్షా సమావేశానికి ఎలా హాజరయ్యారవుంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వీరు ప్రభుత్వ అధికారా లేక పార్టీ ప్రతినిధా? అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్త వహిస్తారని ఆశిద్దాం.