చీరాల (Chirala) : మండలం కొత్తపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకు (Union Bank) శాఖను శాసన సభ్యులు ఎంఎం కొండయ్య (MLA Kondaiah) మంగళవారం ప్రారంభించారు. SLBC AP కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ విజయవాడ జనరల్ మేనేజర్ సివిఎన్ భాస్కరరావు సమక్షంలో జరిగింది.
అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు ప్రాంతీయ అధికారి వి రవికుమార్, ఉప ప్రాంతీయ అధికారి కె రామలింగేశ్వరరావు, ఉప ప్రాంతీయ అధికారి బి శ్రీనివాసరావు, కొత్తపాలెం శాఖాధిపతి రాగాల శ్రీనివాస్ పాల్గొన్నారు






