చీరాల (DN5 News) : మహిళా విద్యకు పునాది సావిత్రిబాయి పూలే అని, ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సామాజిక సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయ్ ఫూలే వర్ధంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు పునాది వేసిందని అన్నారు. సమాజంలో సమానత్వం కోసం పోరాడిన మహానీయురాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు విద్యా హక్కు కల్పించేందుకు ఆమె చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో ఆమె ప్రారంభించిన ఉద్యమం సమాజంలో గొప్ప మార్పుకు దారి తీసిందని అన్నారు. సమాజంలో కుల, లింగ వివక్షలు తొలగి సమానత్వం నెలకొనేందుకు సావిత్రిబాయి చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధనరావు పాల్గొన్నారు.






