Home ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ పరిశ్రమను ఆదుకోండి : ఏలూరి ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్రకు వినతి

గ్రానైట్ పరిశ్రమను ఆదుకోండి : ఏలూరి ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్రకు వినతి

174
0

అమరావతి : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభనికి గురైందని, గ్రానైట్ పరిశ్రమకు అండగా నిలిచి ఆదుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో గ్రానైట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు భూగర్భ, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు గురువారం వినతి పత్రం అందజేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరితో కలిసి గ్రానైట్‌ పరిశ్రల అధినేతలు గ్రానైట్ సమస్యలపై చర్చించారు.

సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రి దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న సమయంలో స్లాబు సిస్టం ప్రారంభ సమయంలో కలర్ గ్రానైట్‌కు 22 క్యూబిక్ మీటర్లకు రాయల్టీ గెలాక్సీ సమానంగా రూ.27వేలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. కానీ రాష్ట్రమంతా కలర్ గ్రానైటికి రూ.22వేలు వసూలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా గ్రానైట్ పరిశ్రమలలకు 22 మీటర్లకు రూ.22వేలు వసూలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసి తమ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.

గ్రానైట్ పలకలు విక్రయించే సమయంలో గ్రానైట్ పలకల కొలతలు వేసే క్రమంలో పొడవు 6, వెడల్పు నందు 3 అంగుళాల చొప్పున అలవెన్సు (భత్యం) ఇవ్వటం ఆనవాయితీ అని, తాము గ్రానైట్ పలకల రవాణా చేసే సమయంలో ఈ అలవెన్సును కూడా డిపార్ట్మెంట్స్ (మైనింగ్ & జియస్టీ) పరిగణలోకి తీసుకొని భారీగా ఆపరాధ రుసుంలు వేస్తున్నారని పేర్కొన్నారు. కావున టన్నుకు 140 లేక 150 అడుగులు వస్తుందని, వీటిలో ఏదో ఒక విధంగా డిపార్టుమెంటు వారికి తగు ఉత్తర్వులు ఇప్పించి తమ ఇబ్బందులు తొలగించాలని అన్నారు. ప్రస్తుతం స్లాబు సిస్టం నందు తాము రాయల్టీ చెల్లించిన తరువాత ఆ నెల చివరి వరకు మాత్రమే బ్లాకులు రవాణా చేసుకొనుటకు తమకు గడువు వున్నదని, ఒక్కొక్కసారి వాతావరణం వల్ల కానీ, లారీల కొరత వల్ల కానీ నిర్ణయించిన గడువులో తాము బ్లాకులు రవాణా చేసుకోకపోవటం వలన రాయల్టీ వ్యర్ధమవుతుందని తెలిపారు.

కావున బ్లాకులు రవాణా చేసుకొను గడువు కనీసం 3 నెలలుగా పొడిగించాలని అన్నారు. గత 10ఏళ్ల నుండి గ్రానైట్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది పరిశ్రమలు బాగా ఏర్పడ్డాయని, నూతన మల్టీ కటర్స్ వచ్చి ఉన్నవని, గతంలో ఒక క్యూబిక్ మీటరుకు 350 చదరపు అడుగులు ఇచ్చి ఉన్నారని తెలిపారు. ఈ కొత్త మల్టీ కటర్ల వలన అది సుమారుగా 450 చదరపు అడుగులకి పెరిగినదని తెలిపారు. కావున తాము రవాణా చేసుకునే ముడిరాళ్ళకు ఈ అదనపు చదరపు అడుగులకు పరిమితులతో సంబంధం లేకుండా ఎఎంఆర్‌ ద్వారా గానీ, లేక ఇతర విధానం ద్వారా గానీ రవాణా చేసుకొనేందుకు అనుమతులు ఇప్పించాలని కోరారు.

శ్లాబు సిస్టెం నందు తాము క్వారీ నుంచి వినియోగించుకునే రాయి కొలతలు, నిబంధనలు లేకుండా అన్ని సైజుల రాళ్ళకు పర్మిట్లకు అనుమతించాలని కోరారు. నిర్దేశించిన పర్మిట్లు వినియోగించుకున్న తరువాత తమకు అవసరమైన పర్మిట్లు శ్లాబు సిస్టం ధర ప్రకారంగా అదనంగా ఇప్పించినట్లయితే ప్రభుత్వంకు ఆదనపు ఆదాయం లభించగలదని, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.