Home ప్రకాశం వైఎస్‌ఆర్‌సిపి సోషల్‌ మీడియా మండల బాధ్యుల నియామకం

వైఎస్‌ఆర్‌సిపి సోషల్‌ మీడియా మండల బాధ్యుల నియామకం

318
0

టంగుటూరు : ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి సోషల్ మీడియా మండల బాధ్యులను డాక్టర్‌ మాదాసి వెంకయ్య నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళి ప్రజలను చెైతన్య పరచాలని, టిడిపి నాయకులు, టిడిపి కోవర్టులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కోరారు. కొండపి మండలానికి వై వసంత్, టంగుటూరుకు మీసాల హరిబాబు, శింగరాయకొండకు కోడిపల్లి మనోజ్, జరుగుమల్లికి ఆత్మకూరి అనిల్, పొన్నలూరుకు స్వర్ణ వంశీ, మర్రిపూడికి వాకా రమణారెడ్డిలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకులు సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి, బొట్లా రామారావు, పల్లెర్ల నరసింహారెడ్డి, సూరం రమణారెడ్డి, మల్లవరపు కోటిరెడ్డి, వాకా ఆదిరెడ్డి, భరత్, దేవరాల శ్రీను, కాపా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.