టంగుటూరు : జరుగుమల్లి, టంగుటూరు మండల వైయస్సార్సిపీ బూత్ కన్వీనర్లతో ఓటు విలువ అవగాహన సదస్సు టంగుటూరులోని కొండపి రోడ్డులోగల వైయస్సార్సిపీ కార్యాలయంలో వైఎస్సార్ సిపి కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా వరికూటి అశోక్ బాబు మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికల్లో బూత్ కమిటీ సభ్యులది కీలమైన పాత్రని చెప్పారు. ఏపార్టీ అభ్యర్థికైనా గెలుపు, ఓటములైనా నిర్థేశించగలిగేది భూత్ కమిటీ సభ్యులనీ చెప్పారు. కావున రానున్న ఎన్నికల్లో ప్రతి భూత్ కమిటీ సభ్యుడు శక్తి వంచనలేకుండా కృషి చేయాలని కోరారు. బూత్ కమిటీ సభ్యులకు త్వరలో శిక్షణ నిర్వహిస్తామన్నారు.
అనంతరం పార్టీ ఆఫీసునుండి బస్టాండ్ సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహంవరకు ఓటు యొక్క విలువను తెలియజేసే విధంగా ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఢాకా పిచ్చిరెడ్డి, టంగుటూరు మండల వైఎస్సార్ సిపి అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, జరుగుమల్లి మండల అధ్యక్షుడు పాటిబంఢ్ల నాగేశ్వరరావు, భువనగిరి సత్యనారాయణ, ఎన్నూరు సత్యం, వైసిపి రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి కనపర్తి శేషారెడ్డి, పమ్మి శేషిరెడ్డి, వాకా బాలక్రిష్టారెడ్డి, యూత్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి మేడికొండ రంగారావు, కసుకుర్తి సుందరరావు, కొమ్ము సురేంద్ర, పెరికల కోటేశ్వరరావు, పాలపర్తి ఏసు, భరత్ రెడ్డి పాల్గొన్నారు.