టంగుటూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 63వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైసిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఢాకా పిచ్చిరెడ్డి, టంగుటూరు మండల వైసిపి కన్వీనర్ మల్లవరపు రాఘవరెడ్డి, రాష్ట్ర వైసీపీ సేవాదళ్ కార్యదర్శి కనపర్తి శేషారెడ్డి, పమ్మి శేషిరెడ్డి, గాదె రమణారెడ్డి, యస్సి సెల్ జిల్లా కార్యదర్శి మేడికొండ రంగారావు, వైసిపి టంగుటూరు యూత్ నాయకులు కొమ్ము సురేంద్ర, దుగ్గిరాల పేర్రాజు, కసుకుర్తి సుందరరావు, రావినూతల మనోహర్, పెరికల కోటేశ్వరరావు పాల్గొన్నారు.