Home ప్రకాశం చీరాలలో ఆమంచి ఆధ్వర్యంలో వైసిపి కార్యాలయం ప్రారంభం

చీరాలలో ఆమంచి ఆధ్వర్యంలో వైసిపి కార్యాలయం ప్రారంభం

263
0

చీరాల : నవ్య కేబుల్ వద్ద మునిసిపల్ కాంప్లెక్స్ నందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను నియోజకవర్గ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలరాతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

నియోజకవర్గంలో దేశాయిపేటలో కార్యాలయాన్ని గతంలోనే ప్రారంభించినప్పటికీ కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు పట్టణంలో అందరికీ అందుబాటులో ఉంటుందని పట్టణ కన్వీనర్ యడం రవిశంకర్, మాజీ మునిసిపల్ చైర్మన్ మొదడుగుల రమేష్ బాబు, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రెగొరీ కోరిక మేరకు ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన చాలా గొప్పగా ఉందని ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్ధానాలన్నింటిని కూడా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని తెలిపారు. ఈకార్యక్రమంలో పట్టణ కన్వీనర్ యడం రవిశంకర్, ప్రముఖ న్యాయవాది కర్నేటి రవి, యాతం మేరిబాబు, సత్యానందం, కోండ్రు కిరణ్, జి సత్యనారాయణ, పాపిశెట్టి సురేష్ పాల్గొన్నారు.