సింగరాయకొండ : పాకల గ్రామ అంబేడ్కర్ నగర్ లో ‘నిన్ను నమ్మం బాబు’ అంటూ గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని కొండపి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి నవరత్నాలు పథకాలు వివరించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎస్సి, ఎస్టీ, బిసిలకు 45సంవత్సరాలకే పించన్ రూ.3వేలు ఇస్టారని అన్నారు.
దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తారని చెప్పారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటినా జబ్బులన్నింటికీ ఆరోగ్య శ్రీ అమలు చేస్తారని చెప్పారు. ఎన్నికల ముందు సంగమేశ్వర ప్రాజెక్టు శంకుస్థాపన చేసి, నేటికీ పని ప్రారంభించని దుస్థితి ఏర్పడిందన్నారు. అక్రమ ఇసుక దందా ఎక్కువగా జరుగుతుందన్నారు. మరోసారి దొంగ హామీల ద్వారా అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నాడని పేర్కొన్నారు.
కాబట్టి మన అందరం సైనికులుగా పోరాడి రానున్న ఎన్నికల్లో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కార్యకర్తలకు చూచించారు. కార్యక్రమంలో వైసిపి మండల అద్యక్షులు తాండ్ర రామూర్తి, ఎంపిటిసి రాపూరి ప్రభావతి, శీలం రాము, గొలమూరి సుందర్ రామిరెడ్డి, సుబ్బరావు, పలయకావేరి రోశయ్య, మాదాల శంకర్, కుంచాల రవి, షేక్ లియఖత్, షేక్ కరీమ్, శీను, షేక్ మెహర్ బాషా, సుబ్బరావు, అశోక్ రెడ్డి, అర్రిబోయిన రామచంద్రయ్య, చామల ఉదయ శంకర్ రెడ్డి, చలంచర్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.