ప్రకాశం (దమ్ము) : డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య కొండపి, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలలోని వైస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప ప్రజా నాయకుడు డాక్టర్ వైఎస్సార్ అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి కుటుంబాలలో వెలుగులు నింపారన్నారు. వైయస్సార్ పాలనను దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదర్శంగా తీసుకున్నారన్నారు. అలాంటి వైయస్సార్ కుమారుడు జగన్ తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
కొండపి మండలం కె ఉప్పలపాడులో డాకా పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని మాదాసి ప్రారంభించారు. సింగరాయకొండ, కొండపి, జరుగుమల్లి మండలాలలో జరిగిన కార్యక్రమాలలో అశోక్ రెడ్డి, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గోగినేని వెంకటేశ్వరరావు, ఎఎంసి డైరెక్టర్ రమేష్, ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.