Home ప్రకాశం దళితులపై చారిత్రక ఘటనలు టీడీపీ కాలంలోనే…. జగన్ సంక్షేమ పథకాలు ఓర్వలేకే చంద్రబాబు దుష్ప్రచారం :...

దళితులపై చారిత్రక ఘటనలు టీడీపీ కాలంలోనే…. జగన్ సంక్షేమ పథకాలు ఓర్వలేకే చంద్రబాబు దుష్ప్రచారం : వైసీపీ కొండపి ఇంచార్జి డాక్టర్ వెంకయ్య

363
0

టంగుటూరు : దళితులపై చారిత్రాత్మకమైన ఘటనలు జరిగింది టిడిపి కాలంలోనేనని వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దళితులు, బీసీలు, మైనారిటీ ప్రజల్లో వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధినేత పిలుపు మేరకు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసారు.

ఈ సందర్భంగా డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ర్రాష్టాన్ని ఎంతో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా చెప్పినవి, చెప్పనివి కూడా నూటికి 90శాతం అటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పూర్తి చేస్తున్నారన్నారు. దేశంలోనే అతి తక్కువ సమయంలో అతి చిన్న వయసులో ఎంతో మంది ముఖ్యమంత్రులను సైతం ప్రక్కకు నెట్టి ఇండియా టుడే ర్యాంకు ప్రకారం మూడవ స్థానంలో మంచి ముఖ్యమంత్రిగా నిలిచాడన్నారు. ఈ క్రమంలో వెంటిలేటర్ పై ఉన్న టిడిపిని ఏ విధంగా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు దళితులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. దళితులకు ఏదో జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ప్రజల్లో ఒక అపోహ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టడం కోసమే అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నట్లు తెలిపారు.

దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అన్నది చంద్రబాబేనని గుర్తు చేశారు. దళితులు శుభ్రంగా ఉండరు. వాళ్ళు నీతిగా ఉండరు. వాళ్లకు చదువు అబ్బదు. వాళ్ళు చదువు కోవడానికి పనికిరారు. వాళ్ళసలు రాజకీయాలకే పనికిరారు. అని అన్నది చంద్రబాబు ఆనంద శిష్యులైన టిడిపి నేత లేనని పేర్కొన్నారు. తాసిల్దార్ వనజాక్షిని ఒక మహిళ అని కూడా చూడకుండా భయంకరంగా కొట్టిన దుర్మార్గుడు టిడిపి నేతలని అన్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన కారంచేడు ఘటన జరిగింది కూడా టిడిపి సమయంలోనేనని అన్నారు. దళితులంటే దూరంగా పారిపోయే చంద్రబాబు ఈరోజు ఏదో కథలు చెబుతున్నాడన్నారు. వైజాగ్ లో జరిగిన శిరోముండనం కేసులో సీసీ ఫుటేజిని పోలీసులు మీడియాకు విడుదల చేశారన్నారు. చీరాలలో జరిగిన సంఘటనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటనే స్పందించి ఎస్సైని సస్పెండ్ చేసి బాధితులకు పరిహారం వచ్చేలా చేశాడన్నారు. కనుమళ్లలో ఒక గిరిజన యువకుడు ఓసి అమ్మాయిని ప్రేమిస్తే కానిస్టేబుల్ తీసుకువచ్చే సమయంలో తప్పించుకునే క్రమంలో లారీ క్రిందపడి చనిపోతే రూ.10లక్షల ఎక్షగ్రేషియా, వాళ్ళ అక్కకు ఉద్యోగం, రెండెకరాల భూమి ఇవ్వాలని కోరితే, కలెక్టర్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రికి రాయడం జరిగిందన్నారు. ఎక్కడైనా ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తున్న తీరు చీరాల ఘటనే నిదర్శనం అన్నారు. వెంటనే చీరాల ఇన్చార్జి ఆమంచి కృష్ణ మోహన్ కు ఫోన్ చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకున్న తీరు గమనించాలన్నారు.

అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు ఏదీ దొరక్క దళితుల మీద దాడులు జరుగుతున్నాయనే దుష్ప్రచారాన్ని చేస్తున్నాడని ఆరోపించారు. తమది దళితుల ప్రభుత్వం అన్నారు. దళితుల ఓట్లతోనే 151 సీట్లు గెలవడం జరిగిందన్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల వారు బ్రతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తూనే ఉంటారన్నారు. ఆ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కాబట్టి వాస్తవాలేవో, అవాస్తవాలేవో గమనించుకోవాలన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా జనంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్యేలైతే తలుపులేసుకుని జూమ్ ముందు మాట్లాడడం తప్ప ప్రజల దగ్గరికి రావడం లేదన్నారు.

కరోనా సమయంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి తమ పార్టీ నాయకులందరూ బయటకు వచ్చారన్నారు. జూన్ ముందు కూర్చుని జగన్ మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తే జనం సహించరని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంగుంట రవిబాబు, వళ్లూరమ్మ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సూరం రమణారెడ్డి, మహిళా నాయకురాలు బొడ్డపాటి అరుణ, డేవిడ్, కోటిరెడ్డి, నత్తల క్రాంతికుమార్, దాసరి సుబ్బారావు, ధర్మేంద్ర, శ్రీను పాల్గొన్నారు.