
టంగుటూరు(Dn5) కొండపి : బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ పేరుతో వైఎస్ఆర్ సీపీ కొండపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం కొండపిలోని సీతారామ కల్యాణ మండపంలో నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి ఆర్కె రోజా మాట్లాడుతూ రాష్టంలో అరాచక పాలన సాగుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్టంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. బాబు, లోకేష్, పవన్ తోడుదొంగలుగా తయారయ్యారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని ప్రతి ఇంటికి వెళ్లి దైర్యంగా చెప్పుకునే పరిస్థితి కూటమి నాయకులకు లేదన్నారు. చంద్రబాబు రాజధాని పేరుతో రు.కోట్ల ప్రజాధనం మింగేస్తున్నారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలపై హామీల జల్లు కురిపించిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి పథకాలు అమలు చేయకుండా నట్టేట ముంచిందని అన్నారు. రాష్టం మళ్ళీ అభివృద్ధి పథంలో నడపాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని అన్నారు. కొండపిలో ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుండి మరోలెక్క అన్నారు. రాబోయే ఎన్నికల్లో కొండపిలో వైసీపీ జెండా ఎగిరే విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. 2029 లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని అన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరును మీకు నచ్చిన బుక్ లో రాసుకోండని, దానికి తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని అన్నారు.
మాజీ మంత్రి, రాష్ట్ర పీఏసీ సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర నాయకులు డాకా పిచ్చిరెడ్డి, వైసిపీ టంగుటూరు మండల అధ్యక్షులు చింతపల్లి హరిబాబు, వైసిపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ గౌరవ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, వైఎం ప్రసాదరెడ్డి (బన్నీ), రాష్ట్ర విభాగ అనుబంధ అధ్యక్షులు, జిల్లా విభాగ అనుబంధ అధ్యక్షులు, నియోజకవర్గ విభాగ అనుబంధ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఆరు మండలాల అధ్యక్షులు, కొండేపి నియోజకవర్గం కార్యకర్తలు, అభిమాను భారీ సంఖ్యలో పాల్గొన్నారు.