Home బాపట్ల శవ రాజకీయాలకు వైసిపి ప్రతిరూపం : పల్లం సరోజినీ జీవన్

శవ రాజకీయాలకు వైసిపి ప్రతిరూపం : పల్లం సరోజినీ జీవన్

23
0

వేమూరు (Vemuru) : నందిగామ సురేష్ ఆసత్య ఆరోపణలకు, అబద్ధ కల్పిత కథలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని టిడిపి (Telugudesham)బాపట్ల పార్లమెంటు మహిళా కార్యదర్శి పల్లం సరోజిని జీవన్‌ ఆరోపించారు. తప్పు చేసిన వ్యక్తులు ఎంత పెద్ద వారైనా కూటమి ప్రభుత్వం ఊరుకోదని అన్నారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉండి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కనీసం పర్యటించని వ్యక్తి సురేష్ అని అన్నారు. చుట్టపు చూపుగా తప్పితే స్థానిక ప్రజల సమస్యలపై ఏనాడైనా పట్టించుకున్నావాని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యునిగా అవకాశం ఇస్తే పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు.

వైసీపీ, నందిగామ సురేష్ (ExMp.Nandigam Suresh) మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం ఎవరూ లేరని, గతంలో కూడా అరటి తోటల దగ్ధం కేసులో సురేష్ అసత్య ఆరోపణలు చేసి సీటు సంపాదించుకొని ఆడిన డ్రామాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదని, తన పార్లమెంటు పరిధిలో చుట్టపు చూపుగా తప్పితే ఏనాడు ప్రజా సమస్యల పరిష్కరించిన దాఖలాలు లేవని అన్నారు. గతంలో జగన్‌తో ఫోటో ఫోజులు ఇవ్వడం తప్పితే తన పార్లమెంటు పరిధిలోని ప్రజలకు, తన సొంత సామాజిక వర్గానికి ఏమాత్రం ఉపయోగ పడని వ్యక్తి నందిగం సురేష్ అని ఆరోపించారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం, పోలీసు వ్యవస్థను తప్పు పట్టే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు. తప్పు చేసిన వ్యక్తులెవరైనా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కనీసం పరామర్శ చేసావా? ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపైన, నాయకులు, అధికారుల పైన అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని అన్నారు.