– శీతాకాలంలో కూడా నీటి ఎద్దడి
– రైతన్నలను ఆదుకోవాలి
– రైతు బరోసా పథకం ఉపయోగకరంగా ఉంటుంది…
– బెస్తావారిపేట మండలం కొత్తపేటలో రావాలి జగన్ కావాలి జగన
గిద్దలూరు : వైయస్ జగన్తోనే రైతన్నలకు మేలు జరుగుతుందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జీ ఐవి రెడ్డి అన్నారు. బేస్తవారిపేట మండలం యంపీ చెరువు పంచాయితీ కొత్త పేటలో రావాలి జగన్ కావలి జగన్ నినాదంతో గడప గడప వైసిపి కార్యక్రమం ఐవిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. వర్షాలు పడక, పంట పొలాలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిల్లో ప్రభుత్వం పట్టించుకొకపోవడం శోచనీయమన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి బాగా పెరిగిందని పేర్కొన్నారు. బోర్లు అడుగంటుక పోయాయన్నారు.
వచ్చేది ఎండా కాలంమని ప్రభుత్యం ముందుగానే మేలుకొని తగిన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేయడం అవసరమాని ప్రశ్నించారు.
నవరత్నాలలోని రైతు బరసో పథకం వల్ల రైతులకు బాగా ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్రాన్ని జగన్ పరిపాలిస్తెనే సకాలములో వర్షాలు పడతాయాన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. జగనన్నతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని చేప్పారు. జగనన్న తీసుకు వచ్చే నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. వైఎస్సార్ ఆసరా పధకం కింద డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అలాగే వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. 25 లక్ష్యల ఇళ్ళను కట్టించే బాద్యత జగన్ మోహన్ రెడ్డి తిస్కోబోతున్నారన్నారు. అలాగే ప్రతి అవ్వకు తాతకు రూ.2000 పెన్షన్ ఇస్తామన్నారు.45 సంవత్సరాలు నిండిన బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.75వేలు దశలవారీగా ఆయా కార్పొరషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామన్నారు. పేదింటి పిల్లలు చదువులకు బయపడనవసరం లేదన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ.15వేలు ఇస్తామన్నారు. వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైన ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందింస్తామన్నారు. రైతు బరోసా పధకం కింద ప్రతి సంవత్సరం జూన్ నెలలో రూ.12500లు ఇస్తామన్నారు. ప్రతి రైతుకు బోరు వేపించే బాద్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
గిట్టుబాటు ధర కలిపించడం, ధర స్థిరికరణకు రూ.3000కోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే క్రాఫ్ లోన్ కింద వడ్డీలేని బ్రుణం ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే ఎవరు అదైర్యపడవద్దని అన్నారు. రాజన్న పాలన జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మళ్ళి చూస్తామాని ప్రజలకు ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ తోనే న్యాయం జరగుతుందని అన్నారు. కార్యక్రమంలో బేస్తవారిపేట మండల కన్వీనర్ బోళా బాలిరెడ్డి, రఘునాథ్ రెడ్డి, కేళం కేశవరెడ్డి, సూర్య నారాయణరెడ్డి, మద్దుల ఈశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, చిరంజీవిరెడ్డి, లక్ష్మయ్య, జిగ్రయా, రహమాన్, రామిరెడ్డి, రమణారెడ్డి, బాల వెంకట్ రెడ్డి, కృష్ణరెడ్డి, తిరుపాల్ రెడ్డి, బైరెడ్డి రమణారెడ్డి, మలెళ్ళ శేఖర్ రెడ్డి, గుర్వారెడ్డి, ఇందెలా నాగిరెడ్డి, కొప్పుల కొండారెడ్డి, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.