చీరాల : “రాజన్న సంక్షేమ పాలన చూశారు. ఉపాధి భయంలేదు. జబ్బొస్తే దవాఖాన భయంలేదు. వర్షాల్లేవన్న భయంలేదు. ఇంటి నిండా ధాన్యం. గుండెనిండా ధైర్యంతో జీవించిన రోజులు గుర్తుండే ఉంటాయి. మళ్లీ అలాంటి రోజులు చూడాలంటే రాజన్న వారసుడు యువనేత వైఎస్ జగన్‌తోనే సాధ్యం. ఓట్ల కోసం మోసపు మాటలు చెప్పలేదు. గత ఎన్నికల్లో అలాంటి మాటలు చెప్పి ఉంటే అధికారం వచ్చి ఉండేది. కానీ రుణమాఫీ అప్పట్లో సాధ్యం కాదని చెప్పారు. ఆచరణలో సాధ్యం కాదని రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబుపాలనలో చూపారు. అందుకే ప్రజా సంక్షేమం చూడటమంటే పారదర్శకంగా ఉండటం.“ అది వైఎస్ఆర్‌సిపికే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తే చాలని వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ పేర్కొన్నారు.
వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నియోజకవర్గ పాదయాత్రల్లో భాగంగా చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా వేటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలాజీ మాట్లాడారు. వైఎస్ఆర్‌సిపి ప్రకటించిన తొమ్మిది సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి కుటుంబానికీ చేరతాయని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ది చేసేందుకు వైఎస్ఆర్‌సిపి కార్యాచరణ తీసుకుంటుందని చెప్పారు. ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేకుండా స్వేచ్ఛాయుత జీవనం గడిపే పరిస్థితులు వైసిపితోనే సాధ్యమని చెప్పారు.
విజయనగరకాలనీలో మొదటిరోజు ప్రారంభమైన యాత్ర కొత్తపాలెం వరకు సాగింది. రెండో రోజు కొత్తపాలెం నుండి దేశాయిపేట వరకు నిర్వహించారు. మూడోరోజు యాత్ర దేశాయిపేట నుండి వేటపాలెం వరకు నిర్వహించారు. బాలాజీ యాత్రకు అడుగడుగునా ప్రజలు పూలతో హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపి చిమటా సాంబు, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కొరబండి సురేష్, వైసిపి చీరాల పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు, వేటపాలెం అధ్యక్షులు కొలుకుల వెంకటేష్, చీరాల రూరల్ అధ్యక్షులు పిన్నిబోయిన రామకృష్ణ, వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండ్రు బాబ్జి, నీలం శ్యామ్యుల్ మోజెస్, ఎస్‌సి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దు ప్రకాశరావు, రాష్ట్ర కార్యదర్శి, కౌన్సిలర్ కన్నెగంటి శ్యామ్‌బాబు, సలగల అమృతరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి గుత్తి ప్రసాద్, బీరక సురేంద్ర, వేటపాలెం గ్రామ అధ్యక్షులు చుండూరి శ్రీరాములు, దేశాయిపేట అధ్యక్షులు బాలబ్రహ్మం, బిసి సెల్ అధ్యక్షులు కర్ణ రమేష్, సీనియర్ నాయకులు కర్ణ లక్షారావు, విద్యార్ధి విభాగం అధ్యక్షులు దేవన శ్రీనివాసరావు, యానాది సంఘం అధ్యక్షులు ఆర్ సంజీవరావు, ఎస్‌సి సెల్ అధ్యక్షులు కాకి డేవిడ్, యువజన కార్యదర్శి చింతా హరీష్, యూత్ అధ్యక్షులు మ్యాత్యుస్, కౌన్సిలర్లు పి శారదాంబ, కుంభా ఆదిలక్ష్మి, మన్నే ప్రేమ్‌కుమారి, టి మనోహరి, అధికార ప్రతినిధి దేవరపల్లి బాబురావు, మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు బురదగుంట ఆశ్వీర్వాదం, డేటా దివాకర్, పాతచీరాల సర్పంచి రాజు శ్రీనివాసరెడ్డి, కె ఆదినారాయణ, షేక్ సుభాని, కోడూరి ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.