టంగుటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అనువైన రెండు భవనాలను వైసిపి కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకయ్య శుక్రవారం పరిశీలించారు. అనంతరం పోలింగ్ బూత్ కమిటీల నిర్మాణం గురించి ప్రణాళికా బద్ధంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆయన వెంట వైసిపి నాయకులు రావూరి అయ్యవారయ్య, బొట్లా రామారావు, తొట్టెంపూడి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ లింగంగుంట రవిబాబు, వంకాయలపాటి రోశి బాబు, ఎంపిటిసిలు అద్దంకి శేషయ్య, మాధవరావు, వేణు, కొమ్ము ప్రభుదాస్, దండేల వినోద్, ధర్మేంద్ర, కసుకుర్తి సుధాకర్, కొర్రకూటి వెంకటేశ్వర్లు, గంగుల శ్రీను, నత్తల కాంతి కుమార్, ఉదయకుమార్, శివ, శ్రీహరి, ప్రేమ్ కుమార్ ఉన్నారు.