Home ప్రకాశం పథకాల అమలులో వారధులు వాలంటీర్లు : కొండపి వైసీపీ ఇంచార్జి డాక్టర్ వెంకయ్య

పథకాల అమలులో వారధులు వాలంటీర్లు : కొండపి వైసీపీ ఇంచార్జి డాక్టర్ వెంకయ్య

311
0

సింగరాయకొండ(దమ్ము) : కోవిడ్ సమయంలో గ్రామ వాలంటీర్లు చాలా బాగా పని చేశారని, ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా వాలంటీర్ల సేవలు ప్రశంసనీయమని వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పేర్కొన్నారు. సింగరాయకొండ ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో వాలంటీర్ల కృషి అభినందనీయమన్నారు. వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారని అన్నారు. అదే ఉత్సాహంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ కులాలకు, మతాలకు, పార్టీలకతీతంగా ప్రజలకు చేర్చాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు తమకు అందడం లేదని అనుకోకూడదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలని కోరారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరారు.

గ్రామాలలో వాలంటీర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, నాయకుల ఒత్తిడులు ఏమన్నా ఉన్నాయాని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సంక్షేమ ఫలాల కోసం ఇబ్బంది పడుతున్నారా? ఇండ్లస్థలాల జాబితాలో పేర్లు రిజెక్ట్ ఐతే ఎందుకు రిజెక్ట్ అయ్యాయో లబ్ధిదారులకు చెప్పాలన్నారు. కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లు తక్కువ జీతాలతో పనిచేస్తున్నారని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వాలంటీర్ల సేవలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఓ జమీఉల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.