ఢిల్లీ : గత ఎన్నికలకు ముందు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బిజెపి, టిడిపి మోసం చేయడానికి నీరసంగా వైఎసార్ సిపి వంఛనపై గర్జన ధర్నా చేశారు. ధర్నా నుద్దేశించి వైసీపీ రాష్ట్ర నాయకులు విజయసాయిరెడ్డి మాట్లాడారు. తెలుగు ప్రజను మోసం చేసినవాళ్ళు ముగ్గురని అన్నారు. ఎలాంటి వనరులు, పరిశ్రమలు లేకుండా విభజించిన సోనియాగాంధీ, పదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్యాకేజీతో మోసం చేసిన బిజెపి, ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఎన్నికలు అయ్యాక ప్యాకేజీతో సరిపెట్టుకుని నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు అని పేర్కొన్నారు.
ఇప్పటివరకు వైసిపి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. కేంద్రంలో ఎన్నికల తర్వాత రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎవరు ఇస్తే వారికే మద్దతిస్తామన్నారు. చంద్రబాబు దేశంలో ఉన్న అన్ని పార్టీలతో అంటకాగారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను ఆదుకొనేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచన పై గర్జన చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వైయస్సార్ సిపి నాయకులు, యంయల్ఏలు, మాజీ యంపిలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.
దీక్షలో నేతలతో వరికూటి
ఢిల్లీలో జరిగిన వంచనపై గర్జన దీక్షకు కొండెపి వైసిపి నాయకులు వరికూటి అశోక్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలు మాజీ యంపి, వైవి సుబ్బారెడ్డి, వైసిపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వైసిపీ రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి, కడప, రాజంపేట మాజీ యంపిలు వైయస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిదున్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు.