శింగరాయకొండ (దమ్ము) : ఆంధ్రప్రదేశ్ ముఖ్రమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్బంగా కొండపి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు ఆద్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా జగనన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు.
ఈసందర్భంగా జరిగిన క్రీడలలో విజేతలుగా నిలచిన వారికి ఈనెల 21న ముఖ్యమంత్రి జన్మదినం రోజున ప్రధానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు, శింగరాయకొండ మండల వైస్ యంపిపి సామంతుల రవికుమార్ రెడ్డి, శింగరాయకొండ వైసీపీ టౌన్ అధ్యక్షులు పటేల్ సాహెబ్, యంబిసి డైరక్టర్ పుట్టా వెంకట్రావు, వెలుగు ఏరియా కో-ఆర్డినేటర్ రాంబాబు, వైసీపీ శ్రేణులు, పోటీదారులు తదితరులు పాల్గొన్నారు.