Home ప్రకాశం పేదల ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకోవడంపై నిరసన

పేదల ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకోవడంపై నిరసన

345
0

చీరాల : గడియార స్తంభం సెంటర్లో పోతుల యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పేదలకు ఇంటి స్థలాల పంపిణీని కోర్టుల ద్వారా అడ్డుకొనడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపిటిసి గోలి ఆనందరావు నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేశారు. ఇకనైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కళ్ళు తెరివండిని కోరారు. మూడు రాజధానులతో రాష్ట్ర అభవృద్ధికి అడ్డు తగులతున్న ప్రతిపక్ష నాయకుడికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కరోనా సమయంలో కూడా మంచి పథకాలను అందిస్తు ప్రజలను ఇబ్బంది పడకుండా చూస్తున సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేత అడ్డు కోవడం మంచి పద్ధతి కాదన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మల్లెల బుల్లిబాబు, సముద్రం పూర్ణ, గోలి శ్రీనివాసరావు, నాగూర్, యుత్ ప్రెసిడెంట్ కటకం జగదీష్, నందం రవి, జగన్ మోహన్, మునగాల సుదర్శనం, నరేంద్ర, దేవరపల్లి రమేష్, దేవరపల్లి పవణ్, అవ్వారు వెంకటేష్, మౌలాలి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.