Home ప్రకాశం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

382
0

– “రాష్గ్త అభివృద్ధి కోసం నేను సైతం” మూడు రాజధానులకు మద్దతుగా సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన.           – వైఎస్ఆర్సిపి చీరాల నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణ మోహన్ సారధ్యంలో పట్టణంలో మూడు చోట్ల సంతకాల సేకరణ శిబిరాలు.     – శిబిరాల వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు

చీరాల : చంద్రబాబుకు నిజంగా రాష్ట్ర అభివ్రుది పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే శాసన మండలిలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ బిల్లులైన సరే ఆమోదించేవారని కానీ అటువంటి ఆలోచన చేయకుండా, దురాలోచనతో తన రాజకియ స్వార్థం కోసం శాసన మండలిలో అన్ని బిల్లులను తిరస్కరించి పెద్దల సభానే అపహాస్యం చేశారని పలువురు వైఎస్ఆర్సిపి నాయకులన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆమంచి కృష్ణ మోహన్ సారధ్యంలో శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు, చంద్రబాబు చేసిన ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్గ్త అభివృద్ధి కోసం నేను సైతం కార్యక్రమని నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు రాజధానులకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. పట్టణంలోని గడియారస్తంభం కూడలి, ముంతావారి సెంటర్, మున్సిపల్ కార్యాలయం ప్రాంతాలలో సంతకాల సేకరణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరాల వద్ద వైసిపి నాయకులు మాట్లాడుతూ మూడు రాజధానులు ముద్దు, ఒక్క రాజధాని వొద్దు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులూ మాట్లాడుతూ రాష్ట ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నపటికీ ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి మాత్రం ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివ్రుది, పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తుంటే టీడీపీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు మాత్రం రాష్ట్ర అబివ్రుదిని చూడలేక ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు స్వార్ధ పూరిత ఆలోచనలతోనే శాసన మండలిలో రాష్ట్ర వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రకరణ బిల్లుతో పాటుగా పేద ప్రజలకు మేలుచేసే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే బిల్లు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ బిల్లుల వంటి ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి కావాలనే తన స్వార్ధ రాజకీయం కోసం బిల్లులను తిరస్కరించారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోకుంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని జోస్యం చెప్పేరు . కార్యక్రమంలో వైసీపీ నాయకులూ మార్పు గ్రెగొరీ, యడం రవిశంకర్, శీలం శ్యామ్, గలాభా బాబు, కోటి దాసు, పేతురు బాబు, వాసుమళ్ళ వాసు, శ్రీను, సత్యానంద్, పాపిశెట్టి సురేష్, డేటా దివాకర్ పాల్గొన్నారు.