Home ప్రకాశం బాలాజీ పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా జ‌న‌నీరాజ‌నం

బాలాజీ పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా జ‌న‌నీరాజ‌నం

855
0

చీరాల : వైఎస్ఆర్‌సిపి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి య‌డం బాలాజీ నియోజ‌వ‌క‌ర్గ పాద‌యాత్ర చేప‌ట్టారు. వైసిపి అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర మూడు వేల కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో య‌డం బాలాజీ విజ‌య‌న‌గ‌ర‌కాల‌నీనుండి ప్రారంభించిన నియోజ‌క‌వ‌ర్గ పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా జ‌నం నీరాజ‌నం ప‌లికారు.

తొలిరోజు పాద‌యాత్ర విజ‌య‌న‌గ‌ర‌కాల‌నీ నుండి ఐక్య‌న‌గ‌ర్‌, జ‌యంతిపేట‌, విజిలీపేట‌, విఠ‌ల్‌న‌గ‌ర్‌, వైకుంఠ‌పురం, గాంధీన‌గ‌ర్‌, కొత్త‌పాలెం పంచాయితీ వ‌ర‌కు యాత్ర సాగింది. యాత్ర‌లో బాలాజీ వెంట వంద‌ల మంది పార్టీ కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూల‌తో స్వాగ‌తం ప‌లికారు. మ‌హిళ‌లు హార‌తులు ఇచ్చి అభిమానాన్ని చూపారు. రానున్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సిఎం కావ‌లంటూ నినాదాలు చేశారు. ఈసంద‌ర్భంగా ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు వివ‌రించిన ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను బాలాజీ తెలుసుకున్నారు. వైఎస్ఆర్‌సిపి అధికారానికి వ‌చ్చిన అనంత‌రం ఒక్కొక్క‌టిగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అవుతాయ‌ని హామీ ఇచ్చారు. డ‌ప్పు వాయిద్యాలు, కార్య‌క‌ర్త‌ల నినాదాల‌తో పాద‌యాత్ర ఉత్సాహంగా సాగింది.

పాద‌యాత్ర‌లో య‌డం బాలాజీ వెంట వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర సంయుక్త‌ కార్య‌ద‌ర్శులు నీలం శ్యామ్యుల్ మోజెస్‌, కొండ్రు బాబ్జి, ఎస్‌సి సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ద్దు ప్ర‌కాష్‌, ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బొనిగ‌ల జైస‌న్‌బాబు, మున్సిప‌ల్ వైస్‌ఛైర్మ‌న్ కొర‌బండి సురేష్‌, ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు బుర‌ద‌గుంట ఆశ్వీర్వాదం, మండ‌ల అధ్య‌క్షులు పి రామ‌కృష్ణ‌, వేట‌పాలెం అధ్య‌క్షులు కొలుకుల వెంక‌టేష్‌, కౌన్సిల‌ర్లు క‌న్నెగంటి శ్యామ్‌, పొదిలి ఐస్వామి, కుంభా ఆదిల‌క్ష్మి, మ‌స‌నం కోటేశ్వ‌ర‌మ్మ‌, షేక్ ఖాతుర‌న్నీసా, మ‌న్నె ప్రేమ‌కుమారి, ఎస్‌టి సెల్ అధ్య‌క్షులు శ్రీ‌కాంత్‌, ఎస్‌సి సెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు గొట్టిపాటి చిట్టిబాబు, మ‌స‌నం రాజు, కోడూరి ప్ర‌సాద‌రెడ్డి, చీరాల న‌గ‌ర్ స‌ర్పంచి రాజు శ్రీ‌నివాస‌రెడ్డి, శారందాంబ‌, మ‌నోహ‌రి, గుద్దంటి సుధాక‌ర్‌, స‌ప్రం ల‌వ‌కుమార్‌, చుండూరి శ్రీ‌రాములు, మిర్యాల శ్రీ‌నివాస‌రావు, య‌డం ర‌విశంక‌ర్‌, టి సుధీర్‌, స‌ల‌గ‌ల అమృత‌రావు, షేక్ సుభాని, ముస‌లారెడ్డి, అన్నం స‌తీష్‌, గోసాల మ‌రియ‌మ్మ పాల్గొన్నారు.