Home ప్రకాశం దేవరాజు సేవా కార్యక్రమాలు అభినందనీయం

దేవరాజు సేవా కార్యక్రమాలు అభినందనీయం

334
0

చీరాల : గడియార స్తంభం సెంటర్లో బీసీల పండగ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ఢిల్లీలో యంగ్ అఛీవర్ అవార్డు అందుకున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజును అభినందించి షాలువతో సత్కారం చేశారు.

కరణం వెంకటేష్ బాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి మాట్లాడుతూ చీరాల పరిసర ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజుకు ఢిల్లీలో యంగ్ అచీవర్ అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరిన్ని అవార్డులు పొందాలని కోరారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, పోతుల సురేష్, జంజనం శ్రీనివాసరావు, అవ్వారు ముసలయ్య, మించాలా సాంబాశివరావు, కొల్లిపర వెంకటేష్, చీరాలలోని ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.