Home ప్రకాశం మహిళా అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం : డాక్టర్ అమృతపాణి

మహిళా అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం : డాక్టర్ అమృతపాణి

245
0

– వైయస్సార్ ఆసరా మహిళలకు బాసట
– మహిళాల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి
– అన్ని రంగాలలో మహిళలు ముందుకు వెళ్లాలి
చీరాల : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా రెండో రోజు చీరాల ఎమ్యెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి సూచన మేరకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి ఆధ్వర్యములో చీరాల మున్సిపాలిటీ 31వ వార్డు సచివాలయంలో వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఉన్న 1536 స్వయం సహాయక సంఘాలకు గాను 890గ్రూపులకు రూ.6కోట్ల 6లక్షలు ఋణ మాఫీ క్రింద మహిళల అకౌంట్స్ కు ప్రభుత్వం నేరుగా జమ చేసిందన్నారు. మహిళా అభివృద్ధి కోసం వైస్ రాజశేఖరరెడ్డి ఒక్క అడుగు వేస్తే సీఎం జగన్ మోహనరెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారని తెలిపారు. సమాజం అభివృద్ధి సాధించాలంటే మహిళాల అభివృద్ధితోనే సాధ్యమవుతుందని అన్నారు.

చీరాల ప్రత్యేక అధికారిణి డాక్టర్ బేబి రాణి, అమృతపాణి, గ్రూప్ లీడర్స్ ఏపీ సీఎం జగన్ మోహనరెడ్డి చిత్రపటానికి ఘనముగా పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ సర్పంచి చుండూరి వాసు, వైఎస్సార్సిపి యువ నాయకులు గోసాల అశోక్ పాల్గొన్నారు.