టంగుటూరు (దమ్ము) : ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన ఆసరా పథకం డ్వాక్రా మహిళలకు ఎంతో భరోసానిస్తుందని వైస్సార్సీపీ టంగుటూరు మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు అన్నారు. వైస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా పంచాయతీ కార్యాలయము వద్ద జరిగిన కార్యక్రమంలో ఆసరా ద్వారా లబ్దిపొందిన డ్వాక్రా మహిళలు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కొవ్వొత్తుల వెలుగులతో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు మాట్లాడుతూ రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆసరాతో మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపాలని అన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేశాడన్నారు. టంగుటూరు పంచాయతీ పరిధిలో ఉన్న 427డ్వాక్రా మహిళా గ్రూపులకు రూ.12కోట్ల నిధులు విడుదలైనట్లు తెలిపారు. నాలుగు విడతల్లో రుణాలు పూర్తిగా మాఫీచేయనున్నట్లు తెలిపారు.
రూ.3.5కోట్లతో మొదటి విడత రుణమాఫీ ద్వారా 3950మంది మహిళలకు లబ్ది చేకూరుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాయని జగన్మోహనరెడ్డి మహిళా పక్షపాతిగా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెదుతున్నారన్నారు. మహిళలు కూడా జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతతో అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, గ్రామ సెక్రటరీ జగదీష్, వెలుగు సీసీ శ్రీను, వైస్సార్ సీపీ గ్రామ నాయకులు బొడ్డపాటి అరుణ, ఉపాధ్యాయులు తుల్లిబిల్లి అశోక్ బాబు, ల్యాబ్ రమణయ్య, తన్నీరు వీరనారాయన, ప్రభుదాస్, మాధవ, అలెగ్జాండర్, బిల్లా అనిల్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.