Home ప్రకాశం వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో వెయ్యిపై బిల్లు అయ్యే అన్ని జబ్బులకు ఉచిత వైద్యం : దేవరాజు

వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో వెయ్యిపై బిల్లు అయ్యే అన్ని జబ్బులకు ఉచిత వైద్యం : దేవరాజు

689
0

– అందరికి ఆరోగ్యమే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లక్ష్యం
– పేదలకు వరం ఆరోగ్యశ్రీ
ఒంగోలు : దోర్నాల మండలంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వైద్య శిబిరాన్ని నిర్వహించాలని జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్, మేనేజర్ చేసిన సూచనల మేరకు చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య బృందం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలందరికి ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నూతన విధానం అమలైతే వెయ్యి రూపాయలకు పైబడిన అన్ని చికిత్సలు ఉచితంగా అందిస్తామన్నారు. దీని వలన పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు.

చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ పలుకురి సురేష్, డాక్టర్ కిరణ్ వైద్య సేవలు అందించారు. ఉచితంగా రక్త పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈఎన్టి స్పెషలిస్ట్ డాక్టర సురేష్ మాట్లాడుతూ చెవిలో, ముక్కులో చేతివేళ్లతో, పెన్సిల్, పెన్ వంటివి పెట్టుకొని తిప్పకూడదని చెప్పారు. ఆహారం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలియజేశారు. చెవి ముక్కు గొంతు సమస్యలతో బాధపడే వారికి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని తెలిపారు.

ఎముకలు విరిగిన వారికి, ఎముకుల సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా ఓపీ, ఉచితంగా డిజిటల్ ఎక్స రే, అన్ని జనరల్, లప్రోస్కాప్రి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు. కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ షేక్ షరీఫ్, టీమ్ లీడర్ వెంకటరావు, వైద్య మిత్ర రాంబాబు, శేఖర్ ఎఎన్ఎం పద్మవతి, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.